: సివిల్స్ అభ్యర్థులకు స్వల్ప ఊరట
సివిల్స్ అభ్యర్థులకు స్వల్ప ఊరట కలిగింది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేటివ్ అర్హత పరీక్ష (సీ శాట్) లో ఆంగ్ల భాష స్కిల్స్ కు సంబంధించిన మార్కులను మెరిట్ లేదా గ్రేడింగ్ కు కలపబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో స్పందించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, 2011లో పరీక్ష రాసిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. దాంతో, సదరు అభ్యర్థులు 2015లో మరోసారి పరీక్ష రాయవచ్చని ఆయన తెలిపారు. సీశాట్ పరీక్ష విధానాన్ని మార్చాలంటూ గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.