: అమెరికాపైనే ఆ దేశం నిఘా పెట్టింది!
ప్రపంచ దేశాలపై నిఘా పెట్టి తీవ్రంగా ఇబ్బందిపెట్టే పెద్దన్న అమెరికా పైనే ఇజ్రాయెల్ నిఘా నేత్రం పెట్టి సంచలనం రేపింది. గతేడాది ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శాంతి చర్చలకు అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. ఈ చర్చల బృందానికి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా జాన్ కెర్రీపై ఇజ్రాయెల్ గూఢచారులు, మరో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు నిఘా పెట్టినట్టు జర్మనీ వారపత్రిక దెర్ స్పీగెల్ కథనం ప్రచురించింది. జాన్ కెర్రీ జరిపిన సంభాషణలను ఇజ్రాయిల్ గూఢచారులు ట్యాప్ చేశారు. దీంతో శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత జూలై 8న గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసింది. దీంతో 1650 మంది పాలస్తీనియన్లు మరణించగా, 65 మంది ఇజ్రాయెలీలు మృత్యువాత పడ్డారు. శాంతి చర్చల సందర్భంగా కెర్రీ ఫోన్ ట్యాప్ చేసి సంపాదించిన సమాచారాన్ని పశ్చిమాసియా దేశాలతో దౌత్య పరిష్కార చర్చల్లో ఇజ్రాయెల్ ప్రభుత్వం వాడుకుని పశ్చిమాసియాలో తమపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్తపడింది.