: నార్సింగిలో ఆందోళనను విరమించిన అన్నదాతలు


మెదక్ జిల్లా నార్సింగిలో అన్నదాతలు ఆందోళనను విరమించారు. వ్యవసాయానికి సరిపడా విద్యుత్తును సరఫరా చేయనందుకు నిరసనగా రైతులు రోడ్డెక్కిన విషయం విదితమే. దీంతో హైదరాబాదు-నిజామాబాదు మార్గంలో ట్రాఫిక్ జామ్ అయి వేలాది వాహనాలు నిలిచిపోయాయి. ఇక మీదట రోజుకు ఆరుగంటల పాటు విద్యుత్తును అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో అన్నదాతలు తమ ఆందోళనను విరమించారు.

  • Loading...

More Telugu News