: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ వాదనలు నెగ్గాయనడం సరికాదు: ఎంపీ వినోద్
సుప్రీంకోర్టు లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చిన తర్వాతే ఎంసెట్ కౌన్సెలింగ్ పై నిర్ణయం తీసుకుంటామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ రోజు కేవలం తమ అభిప్రాయం మాత్రమే తెలిపారని... కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాతే తాము ఈ నిర్ణయంపై సమాలోచన చేస్తామని ఆయన అన్నారు. సుప్రీంకోర్టులో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వాదనలు నెగ్గాయని అనడం కరెక్ట్ కాదని వినోద్ అన్నారు.