: అమీర్ ఖాన్, 'పీకే' చిత్ర దర్శక నిర్మాతలపై కేసు నమోదు
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమస్యల్లో చిక్కుకున్నాడు. అమీర్ పైన, 'పీకే' చిత్ర దర్శక నిర్మాతలపైన కాన్పూర్ కోర్టులో కేసు నమోదైంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదలైన పోస్టర్ లో ఒంటిపై ఎలాంటి నూలుపోగు లేకుండా, ప్రైవేటు పార్ట్ భాగంలో రేడియోను అచ్చాదనగా పెట్టుకుని అమీర్ సీరియస్ గా చూస్తుంటాడు. దీనిపై లాయర్ మనోజ్ దీక్షిత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రెండు రోజుల కిందట పిటిషన్ వేశాడు. దీనిపై ఈ నెల 7న న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.