: బిగ్ బాస్ ఆఫర్ తిరస్కరించిన వివాదస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్
బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ కు కలర్స్ ఛానెల్ లో ప్రసారమయ్యే మోస్ట్ పాప్యులర్ రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొనమని ఆహ్వానం అందింది. అయితే ఈ ఆఫర్ ను తస్లీమా నస్రీన్ రిజెక్ట్ చేసింది. బిగ్ బాస్ లో పాల్గొనడం ద్వారా ప్రపంచానికి తస్లీమా నస్రీన్ అంటే ఏంటో తెలియజేయవచ్చని... దీంతో పాటు మంచి పారితోషికం కూడా ఇస్తామని బిగ్ బాస్ వర్గాలు తనను సంప్రదించాయని తస్లీమా నస్రీన్ ట్వీట్ చేశారు. అయితే ఈ ఆఫర్ ను తిరస్కరించినట్టు తస్లీమా నస్రీన్ తెలిపారు. ఇటీవలే కేంద్రప్రభుత్వం తస్లీమా నస్రీన్ ఇండియా లో నివసించేందుకు రెండు నెలల రెసిడెన్షియల్ వీసాను జారీ చేసేందుకు అంగీకరించింది.