: సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిన రైతన్నలు
తెలంగాణలో నిరంతర విద్యుత్ కోతలపై రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మెదక్ జిల్లా నార్సింగిలో వందలమంది రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సమయంలో రైతులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో పదిమందికి గాయాలయ్యాయి. అటు నల్గొండ, రంగారెడ్డి పలు జిల్లాల్లో రైతులు విద్యుత్ సబ్ స్టేషన్ లను ముట్టడించారు.