: వారణాసి వితంతువుల రాఖీ 'స్పెషల్'... మోడీ కోసం!


రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్) సమీపిస్తుండడంతో దేశవ్యాప్తంగా స్త్రీలు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. వారు ఈ పండుగ రోజున తమ సోదరులకు రాఖీలు కట్టి వారి ఆశీర్వాదాలు అందుకోవడం ఆచారం. అయితే, హైందవ సంప్రదాయాన్ని అనుసరించి వితంతువులు రాఖీలు కట్టడంపై ఆంక్షలు ఉన్నాయి. దీనిపై వారణాసికి చెందిన బిందేశ్వర్ పాఠక్ (సులభ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు) అనే సామాజిక కార్యకర్త ఉద్యమించారు. ఈ క్రమంలో వారణాసికి చెందిన వృద్ధ వితంతు మహిళలతో సుమారు 1000 రాఖీలు, మిఠాయిలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపాలని నిశ్చయించారు. మోడీ వారణాసి నుంచి లోక్ సభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. వైధవ్యం అనుభవిస్తున్న వారిని కూడా సంస్కృతిలో భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతోనే మోడీకి రాఖీలు పంపుతున్నామని పాఠక్ వివరించారు. వితంతువుల పట్ల దేశ ప్రజల వైఖరిలో మార్పు తేవడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. కాగా, ఆగస్టు 10న రక్షాబంధన్ దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు.

  • Loading...

More Telugu News