: ఏపీ బస్సులను నిలిపివేసిన విద్యార్థులు
తమ బస్ పాసులను అనుమతించడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులను విద్యార్థులు నిలిపివేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడలో జరిగింది. కృష్ణా జిల్లా తిరువూరు బస్సుల్లో తమ పాసులను నిరాకరిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు రోడ్డుపైన ధర్నాకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వందలాది వాహనాలు నిలిచిపోయాయి.