: రోడ్డెక్కిన మెదక్ జిల్లా రైతన్నలు


వేళాపాళా లేని విద్యుత్ కోతలను నిరసిస్తూ అన్నదాతలు మరోసారి రోడ్డెక్కారు. మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగిలో 44వ నంబర్ జాతీయ రహదారిపై రైతన్నలు రాస్తారోకో చేశారు. గంటకు పైగా రాస్తారోకో చేయడంతో... హైదరాబాద్-నిజామాబాద్ రహదారిపై వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, రోజుకు కనీసం గంటపాటు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News