: విజేతలకు చంద్రబాబు అభినందనలు
గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్న తెలుగు తేజం పారుపల్లి కశ్యప్ కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, మహిళల డబుల్స్ లో రజత పతకం సాధించిన గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలను కూడా ఆయన అభినందించారు.