: టీడీపీలోకి నన్ను ఆహ్వానించారు: జగ్గారెడ్డి
టీడీపీలో చేరనున్నారన్న వార్తలపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. టీడీపీలోకి తనను ఆ పార్టీకి చెందిన కొంతమంది ముఖ్యనాయకులు ఆహ్వానించడం నిజమేనని ఆయన తెలిపారు. అయితే, టీడీపీలో చేరే విషయమై తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని జగ్గారెడ్డి తెలిపారు. ఈ విషయంపై తన అనుచరులతో మాట్లాడిన తర్వాతే టీడీపీలో చేరే విషయంపై తుదినిర్ణయం వెల్లడిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి చేరికపై తెలంగాణ టీడీపీ నాయకత్వం చాలా ఆశలు పెట్టుకుంది. మాస్ ఇమేజ్ ఉన్న జగ్గారెడ్డి తమ పార్టీలో చేరితే మెదక్ జిల్లాలో తాము మరింత బలపడతామని వారు భావిస్తున్నారు.