: ఏపీలో 14 విమానాశ్రయాలు... చంద్రబాబు యాక్షన్ ప్లాన్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని విమానాశ్రయాలు ఉండగా... మరికొన్ని నూతనంగా నిర్మించాలని భావిస్తున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే విషయం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం శ్రీకాకుళం, కుప్పం, కర్నూలు, ఒంగోలు తదిర చోట్ల నూతన విమానాశ్రయాలు రానున్నాయి. నెల్లూరులో మధ్యస్థాయి విమానాశ్రయం నిర్మించాలని, కడపలో ఇప్పటికే సిద్ధంగా ఉన్న విమానాశ్రయాన్ని ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు. పుట్టపర్తిలో విమానాల సర్వీసింగ్ కేంద్రాన్ని ప్రారంభించడంపై ఇప్పటికే బాబు దృష్టి సారించారు.

  • Loading...

More Telugu News