: కశ్యప్ ను అభినందించిన కేసీఆర్
32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 1982 కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాడు సయ్యద్ మోడీ గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత... మరెవరూ ఆ ఘనతను సాధించలేకపోయారు. తాజాగా, కశ్యప్ ఆ ఘనత సాధించడంతో... దేశం యావత్తు సంబరాల్లో మునిగింది. ఈ సందర్భంగా, స్వర్ణ పతక విజేత కశ్యప్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ ఈవెంట్లలో కశ్యప్ మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.