: బాబు, కేసీఆర్ తో మాట్లాడుతా: గవర్నర్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని గవర్నర్ నరసింహన్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రులిద్దరూ కలిసినప్పుడే ఈ సమస్యను ప్రస్తావిద్దామనుకున్నానని, అయితే ముఖ్యమంత్రులిద్దరితో కలసి కూర్చునే సమయం చిక్కలేదని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన స్పష్టం చేశారు.