: అమెరికా చికెన్ లెగ్స్ దిగుమతి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తాం: కేకే
అమెరికా చికెన్ లెగ్స్ ను భారత దేశానికి సరఫరా చేయడాన్ని తాము ఒప్పుకోమని టీఆర్ఎస్ ఎంపీ కేకే తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అమెరికా చికెన్ లెగ్స్ సరఫరా చేసే అంశం చాలా కీలకమైనదని అన్నారు. హార్మోన్ ఇంజెక్షన్ల ద్వారా కోళ్లు త్వరగా ఎదిగిపోయేలా చేసి, పంపించే అనారోగ్యకరమైన ఆ కోడి మాంసం దిగుమతిపై పార్లమెంటులో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తామని అన్నారు. టీఆర్ఎస్ నిర్వహించే చర్చలు, సమావేశాలపై సానుకూల కథనాలు మాత్రమే ప్రసారం చేయాలని ఆయన మీడియాకు సూచించారు. స్నేహితుల దినోత్సవం రోజున మీడియావారు ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుదని ఆయన సూచించారు.