: అధికార గర్వంతో కాంగ్రెస్ నేత కుమారుడు అత్యాచారం చేశాడు
అరాచకాల ఉత్తరప్రదేశ్ లో అధికార గర్వం ఏ స్థాయిలో అరాచకాలకు తెరతీస్తోందో తెలిపే సంఘటన చోటు చేసుకుంది. యూపీలో ఎంత పెద్ద తప్పు చేసినా సులువుగా తప్పించుకోవచ్చనే భావన విపరీతంగా పెరిగిపోయింది. అవసరమైతే నేతలు అండగా నిలుస్తారు, లేదంటే పోలీసులు అండగా నిలుస్తారు అనే భావనను బలపరిచే ఘటన ఆందోళనకు గురి చేస్తోంది. మీరట్ లో ఓ 21 ఏళ్ల మహిళపై స్థానిక కాంగ్రెస్ నేత కుమారుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన మీరట్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాలో ఉంటున్న ఆ మహిళను జూలై 29 వ తేదీన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కుమారుడు నోయిడా 29వ సెక్టార్ నుంచి బలవంతంగా హోటల్ కు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లగా, అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకునేందుకు విముఖత చూపారు. దీంతో ఆమె డీఐజీని ఆశ్రయించింది. వెంటనే డీఐజీ కే.సత్యనారాయణ కేసు నమోదుచేసి దర్యాప్తుకు ఆదేశించారు.