: శాంతి చర్చలకు కైరో చేరుకున్న హమాస్ ప్రతినిధుల బృందం
శాంతి చర్చల నిమిత్తం పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ కి చెందిన ప్రతినిధుల బృందం ఈజిప్టు రాజధాని కైరో చేరుకుంది. అమెరికా, ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో 16 గంటల కాల్పుల విరమణ ప్రకటించి రెండు గంటలు కూడా అమలు చేయకపోవడంతో మరోసారి శాంతి చర్చల కోసం ఈజిప్టు, అమెరికా అధికారుల ద్వారా హమాస్ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే హమాస్ మధ్యవర్తులను తప్పుదారి పట్టిస్తున్నందున ఈ చర్చలకు తాము ప్రతినిధులను పంపించేది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. దీంతో చర్చల ప్రక్రియ జరుగుతుందో లేదో తెలియని అనిశ్చితి నెలకొంది.