: నమ్మిన వాడే ముంచాడు... సామూహిక అత్యాచారం చేసి ఆటోలోంచి తోసేశారు


నమ్మిన వారే నట్టేట ముంచుతున్నారు. స్నేహం, ప్రేమ నటించి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆసరాలేని మహిళలు అన్యాయానికి గురౌతున్నారు. ఇలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. కోల్కతా శివార్లలోని ఆక్రా ప్రాంతంలో ఓ వివాహిత భర్త నుంచి విడిపోయి తల్లి దగ్గర ఉంటోంది. ఆమెకు షఫీక్ అనే వ్యక్తితో సన్నిహిత సంబంధముంది. దీనిని అవకాశంగా తీసుకున్న షఫీక్ ఆమెకు ఫోన్ చేసి పిలిచి, నెంబర్ ప్లేట్ లేని ఆటోలో తీసుకెళ్లాడు. ఈ ఆటోలో షఫీక్ తో పాటు మరో నలుగురు ఉన్నారు. ఆటో ఎక్కిన ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. దానిని తాగిన ఆమె మత్తులో జోగుతూ నిస్సహాయ స్థితికి జారిపోగానే ఆటోలో ఐదుగురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి పని పూర్తికాగానే మత్తులో ఉన్న ఆమెను ఆటోలో నుంచి కిందికి తోసేశారు. కిందిపడి తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటుండగా, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు షఫీక్ కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News