: న్యాయమూర్తి దవే సంచలన వ్యాఖ్యల్ని ఖండించిన జస్టిస్ కట్జూ
తనకి అవకాశమిస్తే ఒకటో తరగతి నుంచి భగవద్గీత, మహాభారతాలు చదివేలా చూస్తానని సంచలన వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవే వ్యాఖ్యలను ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ ఖండించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, భారతదేశం లాంటి లౌకిక దేశంలో అలాంటి ప్రయోగాలు మేలు కన్నా కీడు చేసే అవకాశమే ఎక్కువని అన్నారు. ఏఆర్ దవే వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని కట్జూ స్పష్టం చేశారు. భిన్నత్వానికి నిలయమైన భారతదేశంలో ఒక మతానికి చెందిన అంశాలు పాఠ్య పుస్తకాలలో ఉంటే మిగిలిన వారు ఎలా ఆమోదిస్తారని ఆయన ప్రశ్నించారు.