: దీపిక, జ్యోత్స్నలకు తమిళ సర్కారు నజరానా
కామన్వెల్త్ క్రీడల్లో రాణించి పతకం సాధించిన ఇద్దరు మహిళా క్రీడాకారిణులకు తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. స్క్వాష్ క్రీడలో తొలిసారి స్వర్ణపతకం సాధించి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన దీపికా పళ్లికల్, జ్యోత్స్న చిన్నప్పలకు తమిళనాడు ప్రభుత్వం 50 లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. కామన్వెల్త్ గేమ్స్లో 14వ పసిడి పతకాన్ని ఈ జోడీ భారత్ కు అందించింది. స్క్వాష్ క్రీడలో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారులుగా దీపికా పళ్లికల్, జోత్స్న చిన్నప్ప చరిత్ర పుటలకెక్కారు.