: కామన్వెల్త్ భారత సిబ్బందిలో ఇద్దరి అరెస్టు
కామన్వెల్త్ క్రీడా పోటీలకు భారత ఆటగాళ్లతో బయలుదేరిన అధికార బృందంలోని ఇద్దరిని గ్లాస్గో పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత ఒలింపిక్ సంఘం కార్యదర్శి రాజీవ్ మెహతాను, రెజ్లింగ్ రెఫరీ వీరేందర్ మాలిక్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వీరిద్దరూ దాడికి పాల్పడ్డారనే కారణంతోనే అదుపులోకి తీసుకున్నట్లు మరో వాదన వినిపిస్తోంది. వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న వీరిని వేర్వేరు ప్రదేశాల్లో నిర్బంధంలో ఉంచినట్లు సమాచారం. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో వీరేందర్ అరెస్టయ్యారని ప్రాథమిక సమాచారం. అయితే మద్యం మత్తులో కారు నడిపిన ఘటనలో మెహతాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది. వీరిద్దరినీ గ్లాస్గో పోలీసులు శనివారం అరెస్ట్ చేయగా, ఆదివారం ఈ విషయం వెలుగు చూసింది.