: ఫేస్ బుక్ పై న్యాయశాస్త్ర విద్యార్థి దావా


సామాజిక సంబంధాల వెబ్ సైట్ ఫేస్ బుక్ పై ఓ న్యాయశాస్త్ర విద్యార్థి దావా వేశారు. తన గోప్యతకు భంగం కలిగించిందంటూ ఆరోపణలు చేసిన ఆస్ట్రియాకు చెందిన విద్యార్థి మ్యాక్స్ స్క్రీమ్స్ వియన్నాలోని వాణిజ్య కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఫేస్ బుక్ లో నిబంధనలకు విరుద్ధంగా తనకు సంబంధించిన సమాచారాన్ని చూసిన ప్రతి ఒక్కరి నుంచి రూ. 41వేలను ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను సాగిస్తున్న న్యాయ పోరాటానికి 130 కోట్ల మంది ఫేస్ బుక్ వినియోగదారులు తనకు మద్దతు ప్రకటించాలని అభ్యర్థించారు. వ్యక్తిగత వివరాలను పరిరక్షించడంలో సామాజిక సంబంధాల సైట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నదే తన డిమాండని మ్యాక్స్ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News