: నెల్లూరు నగర అపరిశుభ్రతను చూసి షాక్ తిన్న నారాయణ... అధికారులకు వార్నింగ్


నెల్లూరు జిల్లా కార్పొరేషన్ అధికారులపై పురపాలకశాఖ మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. ఈ రోజు నెల్లూరు పట్టణంలో ఆకస్మికంగా నారాయణ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా ఆయన నగరంలోని పలు ప్రాంతాలను ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ఆయన సందర్శించిన చాలా ప్రాంతాలు అత్యంత అపరిశుభ్రంగా, మురికి... బురదలతో నిండి ఉండడంతో్ నారాయణ షాక్ కు గురయ్యారు. నెల్లూరు మునిసిపల్ అధికారులు పారిశుద్ధ్య నిర్వహణ గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన అధికారులపై మండిపడ్డారు. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే కఠిన చర్యలకు వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News