: గోదావరి పుష్కరాలను మోడీ ప్రారంభిస్తారు: ఏపీ మంత్రి మాణిక్యాలరావు
పరమ పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడించారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పుష్కరాల రేవును పరిశీలించిన మంత్రి ఈ మేరకు ప్రకటించారు. పుష్కరాల ఏర్పాట్లకు రూ.500 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా వివిధ దేవాలయాలకు చెందిన 28 వేల ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.