: ముంబై దాడుల చార్జీషీట్ లో ఒక్క పేరాకే పరిమితమైన లష్కరే ప్రస్తావన
ముంబై దాడులకు పాల్పడింది తీవ్రవాదులే అయినా, దాడులకు కీలక సూత్రధారిగా వ్యవహరించింది లష్కరే తోయిబానే. లష్కరే తోయిబా సహకారంతో దేశంలోకి చొరబడ్డ తీవ్రవాదులు 166 మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు, ఎట్టకేలకు సుదీర్ఘ విచారణ అనంతరం చార్జీషీటు దాఖలు చేశారు. అయితే దీనిలో లష్కరే తోయిబా ప్రస్తావనను కేవలం ఒక్క పేరాకు మాత్రమే పరిమితం చేశారు. చార్జీషీటు 11 వేల పేజీలుండగా, అందులో లష్కరే తోయిబా ప్రస్తావన కేవలం నాలుగు లైన్లకు పరిమితమవడం విడ్డూరమే. లష్కరే తోయిబా ప్రస్తావననే పేరాకు కుదించారంటే, మిగిలిన పేజీల్లో ఏమేం ప్రస్తావించారోనన్న ఆసక్తి కలగక మానదు.