: చైనీస్ భాషలో మోడీ ప్రస్థానం


భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్థానం ఇప్పుడు విదేశాల్లోనూ అధ్యయన అంశంగా మారింది. తాజాగా 'మోడీ-ఇన్ క్రెడిబుల్ ఎమర్జెన్స్ ఆఫ్ ఏ స్టార్' పేరిట బీజేపీ ఎంపీ, జర్నలిస్టు తరుణ్ విజయ్ రాసిన పుస్తకాన్ని చైనీస్ భాషలోనూ ప్రచురించారు. సైచువాన్ యూనివర్శిటీలోని దక్షిణాసియా అధ్యయన కేంద్రం ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మోడీకి ఈ పుస్తకాన్ని బహుకరించారు. ఈ పుస్తకం కోసం మోడీ తన సందేశం రాశారు. ఇప్పుడు భారత్ లో పరిణామాలు ఎలా ఉన్నాయన్న దానిపై చైనీయులకు ఇది అవగాహన కల్పిస్తుందని ఆ సందేశంలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News