: నారాయణ కాలేజ్ లో బల్లిపడిన ఆహారం తిని... అనార్యోగం పాలైన 40మంది విద్యార్థులు
హైదరాబాద్... హయత్ నగర్ లోని మునగనూరు నారాయణ జూనియర్ కాలేజ్ లో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి బల్లి పడిన భోజనం తినడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నలభై మంది అనారోగ్యం పాలవడంతో మిగతా విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు నాణ్యమైన ఆహారం అందించటం లేదని, కనీసం అస్వస్థతకు గురైన వారికి సరైన వైద్య సదుపాయాలు కూడా కల్పించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు ఫీజులు తీసుకుంటున్న యాజమాన్యం తమకు కొన్నాళ్లుగా రోజు కనీసం నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై అటు కళాశాల యాజమాన్యానికి, వార్డెన్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా వారు ఏమాత్రం పట్టించుకోలేదని విద్యార్థులు తెలిపారు. నారాయణ కాలేజ్ విద్యార్థుల ఆందోళన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.