: ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ కు రంగం సిద్ధం


రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటన చేశారు. సెప్టెంబర్ 5న విడుదల కానున్న నోటిఫికేషన్ ద్వారా 10 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న డీఈడీ, బీఈడీ అభ్యర్థుల కల ఫలించనుంది. ఇప్పటికే టెట్ పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు మూడేళ్లకు పైగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా జారీ కానున్న నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ అవుతాయని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News