: తెలంగాణ అనొద్దు... తెలంగాణ రాష్ట్రం అనండి: సీఎస్
టీవీలలో చదివేటపుడు, పత్రికలలో రాసేటపుడు తెలంగాణ అని సంబోధించడం సరికాదని, తెలంగాణ రాష్ట్రం అని పేర్కొనాలని తెలంగాణ రాష్ట్రం ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అన్ని పత్రికలు, టీవీ చానెళ్ల ఎడిటర్లకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక మీడియా ప్రతినిధులు సంబోధిస్తున్న తెలంగాణ పదం సరికాదని, తెలంగాణ రాష్ట్రం అని సంబోధించాలని ఆయన లేఖలో కోరారు.