: రౌద్రరూపం దాల్చిన బీహార్ దుఃఖదాయని


బీహార్ దుఃఖదాయనిగా పేరుగాంచిన కోసి నది పరవళ్లు తొక్కుతూ ప్రమాదకర స్థాయికి చేరుకుందని నేపాల్ ప్రభుత్వం సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన బీహార్ ప్రభుత్వం నదికి ఇరువైపులా ఉన్న సుపౌల్, సహార్సా, మధేపురా, మధుబని జిల్లాల్లో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. నేపాల్ లో కురిసిన భారీ వర్షాలతో కొండచరియలు విరిగి పడి 30 అడుగుల ఎత్తు నీటిమట్టంతో కోసి నది ప్రళయభయంకరంగా పరవళ్లు తొక్కుతోందని బీహార్ ను నేపాల్ హెచ్చరించింది. దీంతో సహాయక దళాలు రంగంలోకి దిగి సహాయ, పునరావాస చర్యలు చేపడుతున్నారు. 2008లో కోసి నది వరదల్లో అపార జన, ఆస్తి నష్టం సంభవించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News