: భారత్ కు మరో పసిడి పతకం
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ పసిడి పతకం సొంతం చేసుకుంది. స్క్వాష్ డబుల్స్ లో జ్యోత్స్న చిన్నప్ప, దీపిక పల్లికల్ జోడీ బంగారు పతకం సాధించి, ఈ విభాగంలో తొలిసారి భారత్ కు బంగారు పతకం అందించారు. దీంతో గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం 55 పతకాలు సాధించి పతకాల పట్టికలో ఐదవ స్థానంలో నిలిచింది. కాగా, భారత క్రీడాకారులు ఇప్పటి వరకు 14 స్వర్ణపతకాలు సాధించగా, 25 రజత పతకాలు సాధించారు. మరో 16 కాంస్య పతకాలతో సత్తా చాటారు.