: యూపీఎస్సీ పరీక్ష అర్హులను గుర్తించేదే తప్ప అనువాద పరీక్ష కాదు: నితీష్ కుమార్


యూపీఎస్సీ పరీక్ష అర్హులను గుర్తించే పరీక్షే తప్ప అనువాద ప్రతిభను కొలిచే పరీక్ష కాదని బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ దేశ రాజధాని అని, అక్కడకు ఎవరైనా వచ్చి స్థిరపడవచ్చని అన్నారు. బీహార్ నుంచి యూపీఎస్సీ పరీక్ష విధానంపై ఆందోళన చేసేందుకు పెద్దఎత్తున యువత వచ్చే అవకాశం ఉందని, వారిని నిరోధించాలని బీజేపీ నేత విజయ్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. యూపీఎస్సీ పరీక్షల్లో సి.ఎస్.ఎ.టి పరీక్ష రద్దు కోరుతూ ఢిల్లీలో యువత ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఆందోళనకు నితీష్ కుమార్ మద్దతు పలికారు.

  • Loading...

More Telugu News