: లిబియా సిమెంట్ కర్మాగారంలో చిక్కుకున్న తెలుగువారు...రక్షించమని ఆర్తనాదాలు
లిబియాలోని సిమెంట్ కర్మాగారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన తెలుగు ప్రజలు చిక్కుకున్నారు. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న లిబియాకు ఉపాధికోసం వారంతా వెళ్లారు. ఇప్పుడక్కడ రక్షణ కరవైన నేపధ్యంలో కంపెనీ వేతనం చెల్లించడం లేదు. తమను స్వదేశానికి పంపేయాలని ఏయూసీసీ సిమెంట్ కర్మాగారం యాజమాన్యానికి కార్మికులు విజ్ఞప్తి చేశారు. వారి వినతిని లైట్ గా తీసుకున్న యాజమాన్యం రెండేళ్ల ఒప్పందం పూర్తయితే కానీ పంపే ప్రసక్తిలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఎవరైనా స్వదేశం వెళ్లాలని నిర్ణయించుకుంటే 70 వేల రూపాయలు చెల్లించి వెళ్లిపోవచ్చని స్పష్టం చేసింది. దీంతో బట్టల్లేక, తిండికి డబ్బుల్లేక తెలుగు వారు తీవ్ర ఇక్కట్లలో చిక్కుకున్నారు. తమను రక్షించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.