: బాక్సింగ్ లో మనకు మరో రజతం... హాకీ, బ్యాడ్మింటన్లో పతకాలు గ్యారెంటీ
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ బాక్సర్లు విశేషంగా రాణిస్తున్నారు. మహిళల విభాగంలో లైష్ రాందేవి, సరితాదేవి సత్తా చాటగా, తాజాగా 49 కేజీల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో దేవేంద్రో రజత పతకం సాధించాడు. దీంతో బాక్సింగ్ లో రజత పతకాల సంఖ్య మూడుకు చేరింది. కాగా, ఈ రోజు జరిగిన క్రీడల్లో భారత క్రీడాకారులు మిశ్రమ ఫలితాలు సొంతం చేసుకున్నారు. హాకీలో భారత జట్టు ఫైనల్ చేరుకుని పతకం ఖాయం చేసుకోగా, బ్యాడ్మింటన్ లో పారుపల్లి కశ్యప్ ఫైనల్ కు చేరి పతకం ఖాయం చేసుకుని సత్తా చాటాడు. అధ్లెటిక్స్ విభాగంలో పరుగుల వీరులు చతికిలపడి పోటీ నుంచి నిష్క్రమించగా, ట్రిపుల్ జంప్, జావెలిన్ త్రో విభాగాల్లో భారత క్రీడాకారులు అర్హత సాధించారు.