: కడపలో టీడీపీ, వైఎస్సార్సీపీ బాహాబాహీ
కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో తెలుగుదేశం, వైఎస్సార్సీపీ నేతలు బాహాబాహీకి దిగారు. కడప జడ్పీ కార్యాలయంలో స్థాయీ సంఘం ఎంపిక కార్యక్రమాన్ని జడ్పీ సీఈవో లేకుండా వైఎస్సార్సీపీ నిర్వహించడంతో టీడీపీ అసహనం వ్యక్తం చేసింది. దీంతో స్థాయీ సంఘ సమావేశం రసాభాసగా మారింది. వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది తీవ్రరూపం దాల్చి ఒకరినొకరు నెట్టుకునేదాకా వచ్చింది. నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నారు. దీంతో టీడీపీ జడ్పీటీసీలు పత్రాలు చించి సమావేశాన్ని బహిష్కరించారు.