: 'ఫొటో' వివాదంలో యూపీ సీఎం అఖిలేశ్
ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. సహరాన్ పూర్ హింసాత్మక ఘటనలో నిందితులుగా పేర్కొన్న కొందరితో ఆయన కలిసి ఉన్న ఫొటోను ఓ హిందీ దినపత్రిక ప్రచురించింది. ఆ ఫొటోను తాము ఓ సమాజ్ వాదీ పార్టీ నేత సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఖాతా నుంచి సేకరించామని ఆ పత్రిక వెల్లడించింది. దీనిపై యూపీ సర్కారు తీవ్రంగా స్పందించింది. ఫొటో సహా సదరు పత్రిక ప్రచురించిన కథనం నిరాధారమని, తప్పుదారిపట్టించడమేనని ఆరోపించింది. ముఖ్యమంత్రి హోదాలో అఖిలేశ్ రోజూ ఎందరినో కలుస్తుంటారని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే కొన్ని ప్రతికూల శక్తులు ఇలాంటి ఫొటోలు చెలామణి చేస్తున్నాయని వివరించారు.