: సింధు పోరు సెమీస్ తో ముగిసింది
కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ లో తెలుగుతేజం పూసర్ల వెంకట సింధు సెమీస్ లో ఓటమిపాలైంది. గ్లాస్గోలో జరుగుతున్న ఈ పోటీల్లో భాగంగా నేడు జరిగిన సెమీఫైనల్లో సింధు 20-22, 20-22తో కెనడా అమ్మాయి మిచెల్లీ చేతిలో పరాజయం చవిచూసింది. కాగా, పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.