: కాంగ్రెస్ పార్టీకి పదవులు, అధికారం ముఖ్యం కాదు... పోరాటం చేస్తాం: బొత్స


కాంగ్రెస్ పార్టీకి పదవులు, అధికారం ముఖ్యం కాదని పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు. శ్రీకాకుళంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాము అధికారంలో ఉండగా అవినీతి జరిగిందని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని అన్నారు. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే ప్రజల తరఫున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. డ్వాక్రా, రైతు రుణమాఫీ చేయాలని, ఫీజు రీయింబర్స్ మెంటు, విద్యార్థుల స్కాలర్ షిప్ లను తక్షణం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశాలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎల్లుండి అన్ని కలెక్టరేట్ల ఎదుట ఆందోళన చేస్తామని బొత్స తెలిపారు.

  • Loading...

More Telugu News