: శిక్షణ కోసం కేరళ వెళ్లిన రాహుల్ గాంధీ


భవిష్యత్ ప్రధానిగా కీర్తించబడుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శిక్షణ కోసం కేరళ చేరుకున్నారు. కోచి ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ అక్కడి నుంచి త్రిసూర్ కి వెళ్లారు. త్రిసూర్ లోని కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్న పంచాయతీరాజ్ శిక్షణా కార్యక్రమంలో రాహల్ పాల్గొంటారు. పౌర సేవలు, స్థానిక సంస్థల పాలనపై సదరు ఇనిస్టిట్యూట్ ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రాక్టికల్, థియరీ శిక్షణ ఇస్తుంటుంది. ఈ రోజు 90 నిమిషాల పాటు జరిగే ఇటువంటి శిక్షణలో రాహుల్ గాంధీ పాఠాలను నేర్చుకుంటారని ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ పి.పి.బాలన్ చెప్పారు. శిక్షణ అనంతరం పంచాయతీ సభ్యులతో రాహుల్ ముఖాముఖీ సమావేశమవుతారు. మొత్తానికి రాహుల్ తన బాధ్యతలను గుర్తెరిగి మసలు కుంటున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News