: పురుషాధిక్యంతో విసిగిపోయారా?... అయితే ఇది మీ కోసమే!
సమాజం మొత్తం పురుషాధిక్యంతో నిండిపోయింది... ఏ పని చేయాలన్నా మనమే... ఇదేం ఖర్మ అనుకుంటున్నారా? అయితే, ఏమాత్రం చింతించకండి... పురుషుడితో వంట చేయించొచ్చు... కాళ్లు పట్టించుకోవచ్చు... ఇళ్లు తుడిపించుకోవచ్చు. ఇలా ఏ పని అయినా చేయించుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? ఇందుకోసం అమెరికా వెళ్లాల్సి ఉంటుంది మరి. అమెరికాకి చెందిన జోసఫైన్ వాయ్ లిన్, దలా కజక్ 'మ్యాన్ సర్వెంట్స్' పేరుతో ఓ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ పురుష పనివారిని సరఫరా చేస్తుంది. గంటకు 4,900 రూపాయలు చెల్లించగలిగితే మీకు కావాల్సిన పనివారిని మీరు నియమించుకోవచ్చు, మీరు కోరినట్టు అతను వ్యవహరిస్తాడు. మీకు నచ్చిన డ్రెస్ వేసుకుని, మీరు చెప్పిన విధంగా నడచుకుంటాడు. ఇందులో ఏమాత్రం అశ్లీలతకు తావు ఉండదని 'మ్యాన్ సర్వెంట్స్' సంస్థ స్థాపకులు భరోసా ఇస్తున్నారు. రోజంతటికీ 18 వేల రూపాయలు ఖర్చు భరించి 'మ్యాన్ సర్వెంట్స్' ను ఎవరు నియమించుకుంటారనే అనుమానం మీకు వచ్చిందా? శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే పార్టీల్లో 'మ్యాన్ సర్వెంట్స్'కు మంచి డిమాండ్ ఉంటుందని వీరు చెబుతున్నారు.