: సినీ పరిశ్రమ నాలుగు కుటుంబాల కబంధ హస్తాల్లో చిక్కుకుంది: పొంగులేటి


తెలుగు సినీ పరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాల కబంధహస్తాల్లో చిక్కుకుందని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ నిర్మాతలు, కళాకారులకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని అన్నారు. సినీ సిటీ నిర్మాణానికి రెండు వేల ఎకరాలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఫిలింనగర్ సొసైటీలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టి, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు కట్టబెట్టిన భూములపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News