: ఎయిర్ పోర్టులో చంద్రబాబు, కేసీఆర్ కరచాలనం... పలకరింపులు!
ఒకప్పుడు ఒకే పార్టీలో గురు శిష్యులుగా వున్న చంద్రబాబు నాయడు... కేసీఆర్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అలాంటి వీరిద్దరూ నేడు కలుసుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి స్వాగతం పలికేందుకు వచ్చిన ఈ ముఖ్యమంత్రులిద్దరూ నవ్వుతూ కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కూడా చంద్రబాబు పలకరించారు. అదే సమయంలో గవర్నర్, బాబు, కేసీఆర్ మధ్య కొద్దిసేపు సరదా సంభాషణ కూడా జరిగింది.