: శ్రీవారి ఖాతాలో 1800 కిలోల బంగారం


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శ్రీవారి పేరు మీద 1800 కిలోల బంగారం డిపాజిట్ చేశారు. దీనికి సంబంధించిన పత్రాలను టీటీడీ ఈవో ఎస్ బీఐ ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్యకు అందజేశారు. గోల్డ్ డిపాజిట్ స్కీమ్ లో టీటీడీ జమచేసిన 1800 కిలోల బంగారం దేశంలోనే అతి పెద్ద డిపాజిట్ అని అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. టీటీడీ, ఎస్ బీఐ మధ్య సంబంధాలు మున్ముందు మరింత వృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు ఆమె ఆకాంక్షించారు. దీంతో, బ్యాంకులో శ్రీవారి పేరు మీద ఉన్న బంగారం మొత్తం 6,800 కిలోలకు చేరింది.

  • Loading...

More Telugu News