: మెట్రోకు భద్రతపై ఆలోచిస్తున్నాం: హైదరాబాద్ పోలీస్ కమీషనర్
మెట్రోకు భద్రత కల్పించడంపై హైదరాబాద్ పోలీస్ కమీషనర్ మహేందర్‌రెడ్డికి ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. ఈ సందర్భంగా హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మెట్రోకు భద్రత కల్పించే అంశం ఎవరి పరిధికి వస్తుందనే విషయంపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని అన్నారు. వీలైనంత తొందరగా మెట్రో భద్రతపై నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. హైదరాబాదు పోలీసులకు సీఐఎస్‌ఎఫ్ తరహా శిక్షణ ఇవ్వాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. మెట్రో స్టేషన్లలో సీసీ టీవీలు, హెచ్చరిక వ్యవస్థలు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.