: ఛాలెంజింగ్ గా పనిచేయండి: జిల్లా కలెక్టర్లకు చంద్రబాబు ఉద్బోధ


జిల్లా కలెక్టర్లు, అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన చెప్పారు. ఛాలెంజింగ్ గా పనిచేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు కలెక్టర్లకు తెలిపారు. ఔషధ మొక్కలను పెంచాలని ఆయన సూచించారు. వ్యవసాయ ఖర్చుల్ని తగ్గించి అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. నీరు, చెట్టు కార్యక్రమాన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులకు చెప్పారు. అనంతపురం, కడప జిల్లాలకు కరవు ప్యాకేజీనివ్వాలని నిర్ణయించినట్లు చంద్రబాబు చెప్పారు. కరవు ప్యాకేజీ నివేదికను తయారుచేయాలని ఆ రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రైతు రుణమాఫీపై రిజర్వ్ బ్యాంక్ తో చర్చలు జరుపుతున్నామని ఆయన అన్నారు. దీనిపై మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదన్నారు. వీలైనంత త్వరగా రుణమాఫీ అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బ్యాంకులకు ష్యూరిటీలు చెల్లించి రుణాలను విడుదల చేయిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News