: విభజన బిల్లులోని అంశాలను రెండు రాష్ట్రాలు పాటించాల్సిందే: వెంకయ్య
విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తప్పకుండా ఆచరించాల్సిందేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన, విభజన జరిగాక రెండు రాష్ట్రాలలోనూ అభివృద్ధి కార్యక్రమాలు మందగించాయని, పరిపాలన కుంటుపడిందనీ అన్నారు. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. పోయినసారి ఢిల్లీ వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు తమ రాష్ట్ర సమస్యలు వివరించారన్నారు. వాటిపైన ఇప్పుడు జరిగిన సమావేశంలో చర్చించానన్నారు. ఇదే సమయంలో కొన్ని విషయాల్లో రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలపై విలేకరులు అడగ్గా, అలాంటి వాటిపై తాను వ్యాఖ్యానించనని స్పష్టం చేశారు. సమస్యలేవైనా ఉంటే రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని, కేంద్రానికి సంబంధంలేదనీ అన్నారు.