: పదేళ్ల కూతురుపై అత్యాచారం చేసిన తండ్రి అరెస్ట్
కన్న కూతురుపైనే అత్యాచారం చేసి మానవ సంబంధాలు, కుటుంబ వ్యవస్థకే మచ్చ తెచ్చిన ఓ కిరాతకుడు కటకటాలపాలయ్యాడు. గోవా రాజధాని పనాజీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే అస్నోరా గ్రామంలో నివాసం ఉండే ఓ వ్యక్తి... పదేళ్ల కూతురుపై చాలా కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని అభంశుభం తెలియని ఆ చిన్నారే వెల్లడించింది. చాలా కాలంగా ఈ తంతు కొనసాగుతోందని బాలిక చెప్పింది. అంతేకాకుండా ఈ అసహ్యాన్ని బాలిక తండ్రి వీడియో కూడా తీసేవాడట. ఈ క్రమంలో ఆ దుష్టుడిని పోలీసులు అరెస్టు చేసి... చిన్న పిల్లలపై అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.