: అమీర్ దిగంబరావతారంపై షారూఖ్ స్పందన


అమీర్ ఖాన్ తాజా చిత్రం 'పీకే' విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. అమీర్ నగ్నంగా ఉన్న పోస్టర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. దీంతో, అమీర్ నగ్నావతారం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఈ విషయమై బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఏమంటున్నాడో వినండి. "అసభ్యకరంగా ఉంది. లోపల ఉన్న టాలెంట్ ను మాత్రమే ప్రపంచానికి చూపించు" అని నవ్వుతూ చెప్పాడు. 'గాట్ టాలెంట్' ప్రోగ్రామ్ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న సందర్భంలో షారూఖ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతలో ఓ తుంటరి రిపోర్టర్ లేచి, బట్టల్లేని అమీర్ ఖాన్ లో మీకు టాలెంట్ కనిపించిందా? అని చిలిపిగా ప్రశ్నించాడు. దీనికి స్పందిస్తూ "ఈ వేదికపై టాలెంట్ గురించి మాట్లాడడం బాగానే ఉంటుంది, కానీ, ఇలాంటి టాలెంట్ గురించి కాదు" అని బదులిచ్చాడు.

  • Loading...

More Telugu News