: పెళ్లికి సిద్ధమవుతున్న హీరో, హీరోయిన్
ప్రముఖ క్రికెటర్ టైగర్ పటౌడీ, సినీ నటి షర్మిళా టాగోర్ దంపతుల కుమార్తె... సినీ నటి సోహా అలీ ఖాన్, సినీ నటుడు కునాల్ ఖేము దంపతులు కాబోతున్నారు. సోహ ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ చెల్లెలు కూడా. 'రంగ్ దే బసంతి' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సోహా, కాల్ యుగ్, ట్రాఫిక్ సిగ్నల్, గోల్ మాల్ వంటి సినిమాల్లో హీరోగా నటించిన కునాల్ ఖేము భార్యభర్తలు కానున్నారు. సుదీర్ఘ కాలంగా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న తాము త్వరలో పెళ్లి చేసుకుంటున్నామని సోహా వెల్లడించింది. కునాల్ ఖేము పారిస్ లో మంచి ఉంగరం బహూకరించి పెళ్లికి ప్రతిపాదించాడని... దానికి తాను సరే అన్నానని సోహా ట్విట్టర్లో పేర్కొంది.